చికెన్ అమ్మకాల పై పర్యవేక్షణ ఏది..?

Published: Wednesday June 29, 2022
మంచిర్యాల టౌన్, జూన్ 28, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా కేంద్రంలో జోరుగా సాగుతున్న చికెన్ వ్యాపారం కనీస నియమాలు పాటించని వ్యాపారులు అడుగు అడుగున మోసమే, చికెన్ కొనుగోలుదారుల కు నష్టమే అయినా పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం,ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తం అయి చర్యలు తీసుకోవాలని ప్రజల ఆవేదన.
 
 
 * కానరాని తునికలు, కొలతల అధికారులు?
 
 చికెన్ కొనుగోలుదారుల కి చికెన్ కొనబోతే చికెన్ తునికల లో మోసమే కనిపిస్తుంది, నాణ్యమైన చికెన్ అందించడం లో వ్యాపారుల నిర్లక్షం, చికెన్ అమ్మకానికి ముందే ఎక్కువ బరువు కోసం నీటిలో ఉంచడం, కొనుగోలు సమయంలో వేసిన తుకం బయట తుకానికి తేడాలు ఉండటం, కొనుగోలు చేసిన చికెన్ కవర్ లో వాటర్ రావడంతో ప్రజలు మోస పోతున్నామని  తెలిసిన తప్పనిసరిగా నిత్యావసర సరుకు గా మారిన చికెన్ కొనక తప్పడం లేదని వాపోతున్నారు.
 
 
 *చికెన్ వేస్ట్ నిర్వహణ పై పర్యవేక్షణ  శూన్యం..?
 
 
కోళ్లను కోసినక మిగిలిన వ్యర్ధాలను సరిగా నిర్వహించడం లేదు, ఈ వ్యర్ధాలను కొన్ని షాపుల వారు జన సంచార ప్రదేశాలలో పడవేయడం తో చుట్టుపక్క నివాసం ఉండే వారికి దుర్గంధం వస్తుందని, దానితో పలు రకాల వ్యాధులకు వ్యాపించి, అనారోగ్య సమస్యలను బరించవలసి వస్తుందని అంటున్నారు. ఈ వ్యర్దల నిర్వహణ పై మున్సిపల్, గ్రామ పంచాయితీ అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
 
 
 *చికెన్ పై లోపించిన పర్యవేక్షణ.
 
 చికెన్ వ్యాపారుల పై జిల్లా యంత్రాంగం చర్యలు తికోడంలో విఫలమైందని స్థానికులు అంటున్నారు, నిత్యం లక్షల్లో వ్యాపారం జరుగుతుండగా, అధికారులు మాత్రం సూచి చూడనట్లు వ్యవహరిస్తున్నారు, మున్సిపల్ శాఖ శానిటరీ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, కలసి పర్యవేక్షణ బాధ్యతలను సక్రమంగా అమలు చేయాలని, కానీ సిబ్బంది కొరత మూలంగా నామమాత్రపు తనిఖీలు నిర్వహించి చేతులు దులపుకుంటున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి చికెన్ కొనుగోలుదారులకు నాణ్యమైన చికెన్ అందించే లాగున చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
 
 
 *చిప్పకుర్తి శ్రీనివాస్ విద్యార్థి  నాయకుడు.
 
  మంచిర్యాల చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూలీ పనులు చేసుకోవడనికి వచ్చినవారు అనేక మంది మంచిర్యాల జిల్లా కేంద్రం లో ఉంటున్నారు, చికెన్ కొనుగోలుదారుల లో అధిక శాతం మంది ఈ కూలీ లే ఉంటారు. వీరి యొక్క డబ్బులను, సాధారణ ప్రజల ను చికెన్ వ్యాపారులు నాణ్యమైన చికెన్ ఇవ్వకుండా దోసుకుంటున్నారు.చికెన్ షాపుల్లో ఖచ్చితమైన తూనికలు, ధరలను పాటించే ల అధికారులు చర్యలు తీసుకోవాలని.