శీలం పుల్లారెడ్డి కళాశాలలో

Published: Thursday April 13, 2023

 ప్రారంభమైన వాక్ ఇన్ ఇంటర్వ్యూలు   మధిర ఏప్రిల్ 12 ప్రజాపాలన ప్రతినిధి  మున్సిపాలిటీ పరిధిలోశీలం పుల్లారెడ్డి మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బుధవారం నాడు నుండి హైదరాబాద్ కు చెందిన హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ శీలం వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఈ ఇంటర్వ్యూలో గత సంవత్సరం డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు,ఈ సంవత్సరం డిగ్రీ పూర్తి కాబోతున్న విద్యార్థులు హాజరైనట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాధవరెడ్డి,హెట్రో కంపెనీ హెచ్.ఆర్ లు శ్రీనివాస్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.