ఘనంగా కొమురం బీం 82 వర్ధంతి వేడుకలు.

Published: Monday October 10, 2022
జన్నారం, అక్టోబర్ 09, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ధర్మారం గ్రామం గోండు గూడెంలో ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీం  82వ వర్ధంతి ని  ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదివాసి గిరిజన సంఘం మండల కమిటీ తరఫున కొమురం బీం చిత్ర పటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి ఎస్కే అబ్దుల్లా మాట్లాడుతూ జల్ జంగల్ జమీన వ్యతిరేకంగా పోరాడిన వీరుడు కొమురం భీం అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కనికరపు అశోక్ మాట్లాడుతూ నేటి యువత కొమరం భీమ్ స్ఫూర్తితో హక్కుల కోసం పోరాడవలసి ఉన్నదని తెలిపారు. స్థానిక గ్రామ అధ్యక్షులు తొడసం హేమలత మాట్లాడుతూ కొమరం భీమ్ ఆదివాసుల హక్కుల కోసం పోరాడి మరణించారని , ఇప్పటికీ 82 సంవత్సరాలు అవుతున్న ఆదివాసుల బ్రతుకులలో మార్పు రాలేదని ఆవేదన వెలబుచ్చారు. ఈ కార్యక్రమంలో  గ్రామ తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు పరచ గిరిజాబాయి, తొడసం గంగు , శిఖరం రాజేశ్వరి, మండాడి కవిత, అర్క సత్యవతి, ఆత్రం సరోజ బాయి తదితరులు పాల్గొన్నారు.