బాలభారతిలో మెగా ఆరోగ్య వైద్యశిబిరం

Published: Monday September 19, 2022
తల్లాడ, సెప్టెంబర్ 18 (ప్రజా పాలన న్యూస్): తల్లాడ లయన్స్  క్లబ్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బాల భారతి విద్యాలయంలో కీర్తిశేషులు కోటగిరి రంగారావు  వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్ సహకారంతో గుండె, ఆర్తో పెడిక్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ నందు పరీక్షలు నిర్వహించగా ఖమ్మం సంకల్ప హాస్పిటల్ వారి సౌజన్యంతో ఆంకాలజీ విభాగం నందు పరీక్షలు జరిపి వారికి తగిన విధంగా ఖమ్మం షణ్ముఖ ఫార్మసీ వారి సహకారంతో ఉచితంగా 50 వేలు విలువచేసే మందులను పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కోశాధికారి కర్నాటి లక్ష్మారెడ్డి, డిసి పులబాల వెంకటేశ్వర్లు,  రీజనల్ సెక్రటరీ పెనుగొండ ఉపేంద్రరావు, కార్యదర్శి వేమిరెడ్డి వెంకట్ నారాయణ రెడ్డి, కోశాధికారి అనుమోలు సర్వేశ్వరరావు, కోటగిరి ప్రవీణ్, కోటగిరి రాధా, దగ్గుల నారాయణరెడ్డి, శీలం  వెంకటరెడ్డి, తిరుమల రావు, గాదె నరసింహారావు, వెంకటేశ్వర్లు, బెల్లంకొండ ఆంజనేయులు ,మిట్టపల్లి కృష్ణ, పసుమర్తి హరీష్, కటిక శ్రీకాంత్, నంబూరు కనకదుర్గ ప్రసాద్,కేతేపల్లి భాస్కర్ రావు, పాల్గొన్నారు.