దుర్భర జీవితం గడుపుతున్న వికలాంగుల సంక్షేమాన్ని మర్చారు

Published: Thursday March 10, 2022
బివిహెచ్ పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సింలు
వికారాబాద్ బ్యూరో 09 మార్చి ప్రజాపాలన : దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సంక్షేమాన్ని విస్మరించారని బివిహెచ్ పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సింలు మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను తక్షణమే సవరించి 10 వేల కోట్లతో వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతున్న 30 లక్షల మంది వికలాంగుల సంక్షేమానికి 10 వేల కోట్లతో బడ్జెజెట్ ను ప్రవేశ పెట్టాలని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఆదేశాల మేరకు ఏర్పాటూ చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమాన్ని విస్మరించి వికలాంగుల సంక్షేమ శాఖను నామరూపాల్లేకుండా చేయాలని కుట్రలు చేస్తోందని ఘాటుగా స్పందించారు.