ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Published: Tuesday October 19, 2021
బెల్లంపల్లి అక్టోబర్ 18, ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిన గ్రామ పంచాయతీలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా అర్హులైన మహిళలకు బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత గ్యాస్ సిలిండర్లను సోమవారం నాడు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకుడు తాళ్లపెళ్లి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ కట్టెల పొయ్యి ద్వారా వచ్చే పొగ పీల్చడం వల్ల మహిళలు అనారోగ్యం బారిన పడుతున్నారని భావించిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళలకు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డు పంపిణీ చేయకపోవడం వల్ల వారు కేంద్ర ప్రభుత్వం అందించే ఉచితం గ్యాస్ కనెక్షన్ పొందే అవకాశం లేక నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బామనపెల్లి ఆనంద్, సోమయ్య, సాయి కిరణ్, లక్ష్మణ్, మల్లేష్, శంకర్, స్వప్న, సరిత, మానస, రమాదేవి, శ్రీకాంత్ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.