పాఠశాల నిర్వహణ గ్రాంటులను విడుదల చేయండి టియస్ యుటియఫ్ బోనకల్ మండల కమిటీ డిమాండ్

Published: Saturday November 26, 2022
బోనకల్, నవంబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలలు తెరిచి ఆరు నెలలు గడిచినప్పటికీ ఇప్పటివరకు పాఠశాలలకు ఎటువంటి గ్రాంట్లు మంజూరు కాకపోవడం వలన పాఠశాలల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు ఆర్థిక భారంగా మారిందనీ ఈ సంక్షోభాన్ని నివారించాలంటే ప్రభుత్వం వెంటనే పాఠశాలల యొక్క గ్రాంట్లు విడుదల చెయ్యాలని ఉపాధ్యాయ సిబ్బంది యొక్క జిపిఎఫ్ లోన్లు, పార్ట్ ఫైనల్, టియస్ జియల్ఐ లోన్లు పిఆర్పీ ఏరియర్స్, సరెండర్ లీవ్ బిల్స్, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, తదితర బిల్లులు నెలల తరబడి పెండింగ్ లో ఉన్నాయని, అన్ని బిల్లులను వెంటనే మంజూరు చేయాలని అదేవిధంగా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించకుండా ఎఫ్ఎల్ఎన్ అమలు సాధ్యం కాదని, ఎఫ్ ఎల్ ఎన్ పై వేసిన టాస్క్ ఫోర్స్ ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలని  యుటియఫ్ బోనకల్ మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా  కోశాధికారి వల్లం కొండ రాంబాబు.మండల అధ్యక్షులు బి ప్రీతం, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ,   ఉపాధ్యక్షులు ఎన్సీఆర్ చంద్రప్రసా,ద్, గోపాల్ రావు, పి నరసింహారావు, కే రమేష్ పుల్లారావు, కే భాగ్యలక్ష్మి ,టి లక్ష్మి శ్రీనివాసరావు , రాణి తదితరులు పాల్గొన్నారు.