సమస్యలు పరిష్కరించకుంటే, టోకెన్ సమ్మెకు సిద్ధం కండి మైనింగ్ స్టాప్ హెచ్చరిక

Published: Thursday October 27, 2022
బెల్లంపల్లి అక్టోబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి:  సింగరేణి సంస్థలో పనిచేస్తున్న మైనింగ్ సిబ్బంది, అపరిస్కృత సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే మైనింగ్ సిబ్బంది టోకెన్ సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలని ఐక్య కార్యాచరణ సమితి విజ్ఞప్తి చేసింది.
ఈ సందర్భంగా స్థానిక శాంతి ఖని గనిపై ఏర్పాటుచేసిన సమావేశంలో గోడప్రతులను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, మైనింగ్ సిబ్బంది ముఖ్యమైన సమస్యలు సూటబుల్ జాబ్, క్యాడర్స్ స్కీం అమలు చేయడం, కోల్ ఇండియాలో వలె అలవెన్స్ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు,
 లేని పక్షంలో మైనింగ్ సిబ్బంది మూకుమ్మడిగా టోకెన్ సమ్మెలోకి వెళ్లిపోవాలని వారు నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో దాసరి తిరుపతి గౌడ్, పొట్ట రాజలింగు, వంగరి రాజేశ్వరరావు, గోపతి సత్యనారాయణ,  నరేందర్, శ్రీకాంత్, అమీర్, భరత్, రమేష్, వెంకటేష్, కరుణాకర్, రాజేష్, మల్లయ్య, తదితర మైనింగ్ సిబ్బంది పాల్గొన్నారు.