నియోజకవర్గలో కోలాహలంగా దీపావళి పండుగ మధిర అక్టోబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి నియోజకవర్గ మండల పర

Published: Wednesday October 26, 2022
ప్రజలు ఘనంగా నిర్వహించారు నియోజవర్గ మండలమున్సిపాలిటీపరిధిలో సోమవారం నాడు దీపాలు పండగ ఘనంగా నిర్వహించిన ప్రజాప్రతినిధులు నాయకులుప్రతి ఇంటిపై దీపాలు వెలిగించడంతో వీధులు కళకళలాడుతున్నాయి మహిళలు భక్తిశ్రద్ధలతో తమ ఇళ్లకు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకుంటున్నారు.ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ పండగ సందర్భంగా ఉత్సాహంగా క్రాకర్స్, మతాబులు,చిచ్చుగుడ్లు, భూచక్రాలు వెలిగించి ఆనందపడుతున్నారు.పెద్ద పిల్లలు దీపావళి బాంబులతో వీధులు దద్దరిల్లేటట్లు చేస్తున్నారు లక్ష్మీ బాంబులు, వంకాయ బాంబులు,రాకెట్ బాంబ్ లు, 120 లతో దద్దరిల్లే సౌండ్లతో ఉత్సాహంగా బాంబులు పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.గత రెండు రోజుల నుండి మధిరలో దీపావళి మందులు అమ్మే షాపులు కిక్కిరిసి ఉండి ఎక్కువ మొత్తంలో బిజినెస్ జరిగింది. ముఖ్యంగా పిల్లల హడావిడి ఎక్కువగా ఉంది. పెద్దలు తమ పిల్లల కోసం వారి సంతోషం కోసం ఖర్చుకు వెనకాడకుండా దీపావళి మందు సామాను కొనిపెట్టడంతో వారి ఆనందాలకు అవధులు లేవు. పిల్లల సంతోషం ఈరోజు పండగ రోజు స్పష్టంగా కనపడింది అనంతరం.
డాక్టర్ వసంతమ్మ సేవా సదనముమానసిక దివ్యాంగుల మధ్య దీపావళి వేడుక జరుపుకున్న హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు *కోమటిడి శ్రీనివాస రావుకోమటి డి సాయి భారత్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దీపావళి పండుగ అందరికీ వారి ఇంట్లో  లక్ష్మి కటాక్ష ఉంటూ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో రైతులు ఆనందంతో వ్యాపారస్తులు వ్యాపారాలతో ఆనందంతో వారి ఇంట్లో దీప వెలుగుతూ ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని తెలిపారు ఈసేవాసదనములో దీపావళి పండగ పిల్లలతో దీపావళి మా కుటుంబ సభ్యులతో చేసుకోవడం శుభదినం వారు పేర్కొన్నారు వారి కుటుంబం అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు