నవాబుపేట్ మండల ఆసుపత్రికి మౌలిక వసతులు

Published: Saturday October 15, 2022
 ఎంపిపి కాలె భవాని రవికాంత్
వికారాబాద్ బ్యూరో 14 అక్టోబర్ ప్రజా పాలన : నవాబుపేట మండల ఆసుపత్రికి కావలసిన మౌలిక వసతుల గురించి చర్చించామని మండల ఎంపీపీ కాలె భవాని రవికాంత్ అన్నారు. శుక్రవారం నవాబుపేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి  కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవాబుపేట ఎంపీపీ కాలె భవాని రవికాంత్ హాజరయ్యారు. మండల వైద్యాధికారి డాక్టర్ ప్రసాద్  అధ్వర్యంలో మండల ఆసుపత్రి కమిటీ సమావేశంలో  ఆసుపత్రికి కావలిసిన అవసరాలు, సదుపాయాలు, పరిశుభ్రత అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఆసుపత్రి ఆవరణలో చెత్త చెదారం లేకుండా చేయుట, సీజన్ వ్యాధులపై చర్యలు తీసుకోవాలని ఆశ వర్కర్లకు సూచించారు. అందరూ తాము చేసే వృత్తిని బాధ్యతగా చేయాలని హితవు పలికారు. ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన వారికి మందులు టీకాలు కూడా వెయ్యాలని స్పష్టం చేశారు. ఈ కమిటీ సమావేశంలో నవాబ్ పేట తహసీల్దార్, ఎంపీడివో, సర్పంచులు, తదితర సభ్యులు పాల్గొన్నారు.