వరిలో మొగి పురుగు నివారణకు ఎఫ్ఎంసీ ఫెర్టెరా

Published: Saturday December 17, 2022
కల్లూరు, డిసెంబర్ 16 (ప్రజాపాలన న్యూస్):
వరిలో మొగిపురుగు నివారణకు ఎఫ్ఎంసీ ఫెర్టెర ఎకరానికి 4 కిలోల మోతాదులో చల్లుకోవాలి అని ఎఫ్ఎంసీ మార్కెటింగ్ మేనేజర్ ప్రసన్న కుమార్ తెలిపారు. శుక్రవారం బోడుమల్లె గ్రామంలో జరిగిన రైతు సదస్సులో పాల్గొన్న 180 మంది రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వరి నాటిన తర్వాత ఎఫ్ఎంసీ జినట్రా ఎకరానికి 250 ml మోతాదులో చల్లుకోవడం లేదా పిచికారి చేసుకోవడం ద్వారా జింక్ లోప నివారణకు, మంచి ఎదుగుదలకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు,  ఎఫ్ఎంసీ ప్రతినిధులు,  డీలర్లు పాల్గొన్నారు.