జిల్లాలోని పాఠశాలలో విద్యార్థుల హాజరు100 శాతం ఉండాలి

Published: Thursday June 16, 2022
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **
 
ఆసిఫాబాద్ జిల్లా జూన్15 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలోని పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థుల హాజరు 100% ఉండాలని, బడిబయట పిల్లలు ఉండకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం జిల్లాలోని జన్కపూర్ రైతు వేదికలో జిల్లా అదనపు "కలెక్టర్ చాహత్ బాజ్ పాయి" జిల్లా విద్యాధికారి ఉదయ్ బాబుతో కలిసి మండల విద్యాధికారులు ప్రత్యేక అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో బడిబాట కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాజిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని గ్రామాలలో ఈనెల 30వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, బడి మానేసిన పిల్లలు, తిరిగి పాఠశాలలో చేర్పించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "మన ఊరు - మన బడి" ఈ కార్యక్రమంలో మొదటి విడతగా ఎంపికైన పాఠశాలలను నిర్వహణకు సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. అన్ని పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు, త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు  కల్పించడం జరుగుతుందని, ఈ విషయాన్ని ప్రతి ఇంటికి తెలియజేసి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం రైతు వేదిక నుండి బడిబాట కార్యక్రమాలపై  అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులుతదితరులు పాల్గొన్నారు.