కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని సత్కరించిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Friday November 11, 2022

మేడిపల్లి, నవంబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి)

 అసెంబ్లీ స్పీకర్ చాంబర్ లో మునుగోడు నియోజకవర్గం నుండి గెలుపొంది  ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని శాలువాతో సత్కరించి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. ఈ  కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గరిక సుధాకర్, కాటేపల్లి రవీందర్ రెడ్డి, పిట్టల నరేష్ ముదిరాజ్, నందికంటి శివ తదితరులు పాల్గొన్నారు.