ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

Published: Monday September 27, 2021
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని ఈరోజు మామునూరు గ్రామ పంచాయతీ నందు చాకలి ఐలమ్మ జయంతి ని ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మారబత్తుల మోహన్ రావు, గ్రామ కార్యదర్శి మల్లాపూర్ శ్రీనివాసరావు, సర్పంచ్ గంగారపు రాధిక, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు రజక సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు వివిధ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినారు.