చాకలి ఐలమ్మ విగ్రహన్ని ఆవిష్కరించిన ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి

Published: Tuesday September 27, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 127 జయంతి సందర్భంగా రజక సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహన్ని ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ఆవిష్కరించినారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొల జమున శ్రీనివాస్, జడ్పిటిసి మనోహర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్, ఎంపిటిసి ల ఫోరం అధ్యక్షులు సుధాకర్ రావు, ఉప సర్పంచ్ గంగారెడ్డి, రజక సంఘం సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.