ఛాతినొప్పి, తలనొప్పులతో అప్రమత్తంగా ఉండాలి మెగా శ్రీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బి వెంకట్ ,

Published: Monday March 06, 2023

 బోనకల్, మార్చి5 ప్రజా పాలన ప్రతినిధి: బిపి, షుగర్ పేషంట్లతో పాటు ప్రతి ఒక్కరూ ఛాతినొప్పి, తలనొప్పులతో అప్రమత్తంగా ఉండాలని మేఘశ్రీ హాస్పిటల్స్ వైద్యులు బి వెంకట్, సతీష్ లు అన్నారు. మండల కేంద్రంలోని మేఘ శ్రీహాస్పిటల్ నందు ప్రతి నెల మొదటి ఆదివారం బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో తూము ప్రకాశరావు జ్ఞాపకార్థం నిర్వహించే బిపి, షుగర్, కంటి ప్రత్యేక క్యాంపు ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బిపి, షుగర్ తో బాధపడేవారు తప్పనిసరిగా మందులు క్రమం తప్పకుండా
వాడాలన్నారు. రోజువారి బిపి, షుగర్ మందులు వాడడం వల్ల ఎటువంటి హానీ జరగదని, రోజువారి వాడడం వల్ల అలవాటుగా మారుతుందని చాలామంది అపోహతో మందులు నిలిపివేస్తున్నారన్నారు. దీనివల్ల పక్షవాతం,గుండెజబ్బులు, ఇతరత్ర సమస్యలు తలెత్తున్నాయని తెలిపారు. ఛాతినొప్పి గ్యాస్ట్రైటిస్ గా , తలనొప్పి సాధరణ తలనొప్పిగా భావించరాదని, వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో నెలకు సరిపడ నాణ్యమైన మందులను అందజేస్తున్నట్లు ఈ క్యాంపును ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకున్నప్పుడే ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశ్యం సార్థకత అవుతుందన్నారు. ఈ క్యాంపులో 100 మంది పేషంట్లకు నెలకుసరిపడ మందులను బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తూము రోషన్ కుమార్ చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గసభ్యులు ఏనుగు సుమన్ బాబు, క్యాంపు నిర్వాహకులు ఆకెన పవన్, సాధనపల్లి ఆమర్నాథ్, యంగల గిరి, పండగ గోపి తదితరులు 
పాల్గొన్నారు.