అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే మోదీ పై తప్పుడు ప్రచారం.

Published: Monday February 07, 2022
మంచిర్యాల బ్యూరో‌, పిబ్రవరి 06, ప్రజాపాలన : సింగరేణి సంస్థలో టిఆర్ఎస్ చేసిన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం, కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోడీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జిల్లా అధ్యక్షులు రఘునాథ్ విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఏడు సంవత్సరాల నుంచి సింగరేణిలో 73వేల ఉద్యోగాలను 42 వేల కు కుదించి ఎంతో మంది నిరుద్యోగ సమస్యకు టీబీజీకేఎస్ పాల్పడిందని ఆన్నారు. అదేవిదంగా టీబీజీకేఎస్ సింగరేణి లో చేస్తున్నటువంటి అన్యాయాలను సింగరేణి చేస్తున్నటువంటి అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ  ఏదో చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారతో కార్మికులను మోసం చేయడానికి టిఆర్ఎస్, టీబీజీకేఎస్ ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. కమర్షియల్ మైనింగ్ చట్టం 2015లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లుకు అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి టీబీజీకేఎస్ గౌరవధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. బాల్క సుమన్ టీఆర్ఎస్ ఎంపీలు ఆ చట్టానికి ఓటు వేశారని గుర్తు చేశారు. ఈ చట్టం పై అభ్యంతరాలు తెలపాలని చెప్పినప్పటికీ 2021 వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయలేదని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఓపెన్ కాస్ట్‌కు వ్యతిరేకం అని చెప్పినటువంటి టిఆర్ఎస్,  2014 నుంచి ఇప్పటి వరకు ఆరు ఓపెన్ కాస్ట్ ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ మండల అధ్యక్షులు కౌన్సిలర్ రాజు బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, బిజెపి నాయకులు సతీష్ రావు, మల్యాల శ్రీనివాస్, రజనీష్, పట్టి కృష్ణ, రంగ శ్రీశైలం, మల్లేష్, ప్రభాకర్ రావు, రమేష్, అశోక్, సాయి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.