ఏక కేంద్ర ప్రభుత్వం గా పనిచేయాలనుకుంటున్న బీజేపీ విధానాలను అడ్డుకుంటాం : ఓ యు జె ఏ సి, టి ఎస్ జ

Published: Saturday August 27, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
 కేంద్ర ప్రభుత్వం -రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం అనే అంశంపై  ఉస్మానియా విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో టీ ఏస్ జేఏసీ చైర్మెన్ మాందాల భాస్కర్  అధ్యక్షతన  సోమాజిగూడ ప్రెస్‌ కౢబ్ వేదికగా జరిగిన  సమావేశంలో విద్యార్థి జేఏసీ వ్యవస్థాపకులు  అశోక్ యాదవ్  స్వాగతోపన్యాసం చేస్తూ  దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.  మొదలుకొని ఇంటెలిజెన్స్ బ్యూరో,నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్,ఈడీ ,సీబీఐ .మొదలుకొని భారత ఎన్నికల కమిషన్ భారత రాజ్యాంగ వ్యవస్థను అడ్డం పెట్టుకుని న్యాయవ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేస్తోంది అనే అంశంపై  రాష్ట్రంలో మరియు దేశంలో వివిధ రాజకీయ పార్టీల పై ఏ విధంగా తమ యొక్క అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రాజకీయ పార్టీలను రాష్ర్టాల ముఖ్యమంత్రులు వివిధ రాజకీయ పార్టీల నాయకులను వేధిస్తునదో రాష్ర్టాల ప్రభుత్వాలను కూల్చడం కోసం తమ అధికారాన్ని ఏవిధంగా అడ్డంపెట్టుకుంటున్నారో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారో వివరించడం జరిగిందన్నారు.    సమావేశంలో  వివిధ పార్టీల ప్రతినిధులు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ JV చలపతిరావు,సీపీఐ పార్టీ  రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు N బాల  మల్లేష్ , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు  డా॥మల్లు రవి , నరేష్ జాదవ్ , వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు జాతీయ బిసి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ,ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సెర్చ్ కమిటీ మెంబర్ ఇందిరాశోభన్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ గఫూర్ , ప్రజాసంఘాల నాయకులు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాల ,బీసీ జనసభ వ్యవస్థాపక అధ్యక్షులు రాజారాం యాదవ్ ,వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం నరేష్ ప్రజాపతి ,   ప్రజా సంఘాల జేఏసీ కంటే సాయన , యువజన సంఘాల నాయకులు  విద్యార్థి సంఘాల నాయకులు పీడీఎస్యూ జూపాక శ్రీనివాస్ , గిరిజన విద్యార్థి సంఘం రవీంద్రనాయక్ , విద్యార్థి జెఎసి అధ్యక్షులు ఎల్చల దత్తాత్రేయ , ఆంధ్రప్రదేశ్ ప్రజాసంఘాల జెఎసి చైర్మెన్ జెటి రామారావు ,తెలంగాణ విద్యార్థి సమాఖ్య(TVS) పూదరి హరిష్ గౌడ్  మాట్లాడుతూ   ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఏ మాత్రం అవినీతికి తావివ్వవని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడానికి మనిష్ సిసొడియా పైకి  ఏవిధంగా ఈడీ సీబీఐలను ఉసిగొల్పిందన్నారు. దానితో పాటుగా భారతదేశ చరిత్రలో రాజదానిగా   పనిచేసిన (పాటలిపుత్రం)పాట్నా  బిహార్లో ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏవిధంగా తమ చేతుల్లో ఉన్నటువంటి ఈడీ సీబీఐలను ఉపయోగించుకుంటుందన్నారు.  దాన్ని అడ్డుకోడానికి గాను క్రియాశీల పోరాటాలు చేయాల్సిన అవసరముందని జెపిసి రౌండ్ టేబుల్ సమావేశం అభిప్రాయపడిందని తెలిపారు.ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం కూడా ప్రైవేటు పరం చేస్తూ దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థను మొత్తం కూడా ఎత్తివేయడానికి కుట్ర పన్నుతున్నట్టు వంటి బీజేపీ విధానాలను రౌండ్టేబుల్ సమావేశం తీవ్రంగా ఖండించిందన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జెఎసి నాయకులు ఎర్రబెల్లి జగన్ బాను నాయక్ విద్యార్థి జెఎసి నాయకులు చిరంజీవి బెస్త, రాజశేఖర్ గౌడ్,సురేశ్ నాయక్, జితేంద్ర పటేల్,ఉపేందర్,జగన్ పెద్ద సంఖ్యలో విద్యార్థులు కుల సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు యువజన సంఘాల నాయకులు  హాజరయ్యారు.