సంగెం లో ఉచిత వైద్య శిబిరం

Published: Wednesday October 06, 2021
వలిగొండ, అక్టోబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని సంగెం గ్రామంలో మంగళవారం దేశ ప్రధాని మోదీ దేశ పరిపాలన 7 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భముగా బిజెపి మండల పార్టీ  సహకారంతో, నూతి చలపతి సౌజన్యంతో హైదరాబాద్ లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ మరియు యూరాలజీ వారి సహకారంతో సంగం గ్రామంలోని పేద ప్రజలకు వైద్య సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు పివి శ్యాoసుందర్ రావు మాట్లాడుతూ గ్రామాల్లోని పేద ప్రజలు వైద్య శిబిరాలను ఉపయోగించుకుని వ్యాధుల పట్ల అవగాహన పెంచుకుని ఆరోగ్యంగా జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి మల్లేశం, నందకుమార్, కీసర రాం రెడ్డి, బాతరాజు బాల్ నర్సింహ, కర్నాటి దనుంజయ్య, నార్ల నర్సింగ రావు, బంధారపు లింగ స్వామి, దంతురి సత్తయ్య, సుధాకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.