బడ్జెట్ కేటాయింపుల్లో వికలాంగులకు మొండిచెయ్యి

Published: Tuesday March 08, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 7 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022- 23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మోసం చేసిందని, తక్షణమే బడ్జెట్ను సవరించి వికలాంగుల సంక్షేమానికి 5 శాతం నిధులు కేటాయించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(NPRD) రంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. 2,56,958 కోట్ల బడ్జెట్లో 5 శాతం ప్రకారం 12847.92 కోట్లు వికలాంగుల సంక్షేమానికి కేటాయించాలి. ఆసరా పింఛన్ల కోసం 2021-22 బడ్జెట్లో కేటాయించిన 11,728 కోట్ల నిధులనే ప్రస్తుత ( 2022-23) ఆర్థిక సంవత్సరానికి కూడా 11728 కోట్ల నిధులు మాత్రమే ఆసరా పింఛన్ల కోసం ప్రభుత్వం కేటాయించింది. 2018 నుండి ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు 3.51లక్షల మంది ఉన్నారు వీరందరికీ ఏప్రిల్ నుండి పింఛన్లు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది నిధులు కేటాయించకుండా పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పడం ఆసరా లబ్ధిదారులను మోసం చేయడం తప్ప మరొకటి కాదు. గత సంవత్సరం బడ్జెట్లో స్త్రీ, శిశు, మహిళా, వికలాంగుల సంక్షేమానికి 1702 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో ఎలాంటి నిధులను ప్రభుత్వం కేటాయించలేదు వివిధ వ్యాపారాల్లో రిజర్వేషన్ అమలు చేసే దానిలో వికలాంగుల ప్రస్తావన లేకపోవడం ద్వారా రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యాలను ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది వికలాంగులు ఉన్నారు వీరి సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి బడ్జెట్ కేటాయింపులు నిదర్శనం అనేక కులాల వారికి బడ్జెట్లో నిధులు కేటాయించిన ప్రభుత్వం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన సమాజంలో వివక్షకు గురవుతున్న వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించాలనే ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం దురదృష్టకరం. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లకు నిధులు కేటాయించిన ప్రభుత్వం వికలాంగుల వివాహ ప్రోత్సాహానికి ఎందుకు నిధులు కేటాయించలేదు స్వయం ఉపాధి కోసం అర్హులైన వికలాంగులకు 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదు స్వయం ఉపాధి పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగ వికలాంగులు దరఖాస్తు చేసుకుంటే నిధులు ఎందుకు కేటాయించలేదు. పరికరాల కోసం అనేకమంది ఎదురుచూస్తుంటే బడ్జెట్లో నిధులు కేటాయించక పోవడం ద్వారా పరికరాల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను పరిశీలిస్తే కాంట్రాక్టర్లు, కమీషన్ల కోసమే బడ్జెట్ ఉందనిపిస్తుంది వికలాంగుల సంక్షేమం కోసం ఉన్నా 2016 ఆర్ పి డి, మానసిక వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, నేషనల్ ట్రస్టు వంటి చట్టాలు అమలుకు ఎలాంటి నిధులు కేటాయించలేదు తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు వారి సహాయకులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిబంధనలు రూపొందించి లబ్ధిదారుల ఎంపిక పై కసరత్తు చేస్తుంది కానీ ఈ బడ్జెట్లో దానికోసం ఎలాంటి నిధుల్ని కేటాయించలేదు. ప్రభుత్వానికి ప్రచారం తీసుకువచ్చే అనేక పథకాలకు బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించడం మీద ఉన్న శ్రద్ధ వికలాంగుల సంక్షేమ మీద లేదు. వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతున్న దానికి ఆచరణలో జరుగుతున్న దానికి పొంతన లేదు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను సవరించి వికలాంగుల సంక్షేమానికి అవసరమైన నిధులు కేటాయించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డిమాండ్ చేస్తుంది.
రేపు జిల్లా వ్యాప్తంగా బడ్జెట్ పత్రాల దగ్ధం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమం విస్మరించిన దానికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో మార్చి 8 నాడు బడ్జెట్ పత్రాలను దగ్ధం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రంగారెడ్డి జిల్లా కమిటీ పిలుపు నిస్తుంది ఆశన్న భుజంగరెడ్డి జిల్లా అధ్యక్షులు, జేర్కోని రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి, ‌‌దేవరంపల్లి రాజశేఖర్ గౌడ్ జిల్లా కోశాదికారి, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ జిల్లా కమిటీ