అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు : మంచిర్యాల ఎసిపి అఖిల్ మహాజన్

Published: Wednesday May 19, 2021

మంచిర్యల, మే 18, ప్రజాపాలన ప్రతినిధి : లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకూడదని, అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని మంచిర్యాల ఎసిపి అఖిల్ మహాజన్ స్థానికులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తా ప్రాంతాల్లో ఏసీపీ ఆకస్మిక తనిఖీ చేసి లాక్ డౌన్ ఆరవ రోజు కొనసాగుతున్న తీరును పరిశీలించారు. రోడ్డు పైకి వచ్చిన పలు వాహనదారులను ఆపి తనిఖీ చేసి వారి వివరాలను, వారు బయటకి రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకి రాకూడదని వారికి  చెప్పారు. అనంతరం బందోబస్తులో ఉన్న అధికారులతో, సిబ్బందితో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తూ తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం పోలీసులు రోడ్డుపై ఎండలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు బయటకు రాకుండా ఇండ్లలో ఉండి ప్రాణాలు సురక్షితంగా ఉంచుకోవడంతో ఫాటు పోలీసులకు సహాకరించారని కోరారు. ఈ అకస్మిక తనికిలో ఎసిపి వెంట మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.రాజు, ట్రాఫిక్ ఎస్ఐ శివకేశవులు, మంచిర్యాల ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఉన్నారు.