సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త కటుకం గణేష్ ను ప్రశంసించిన మంత్రి కే.టీ.ఆర్

Published: Wednesday June 09, 2021
కోరుట్ల, జూన్ 08 (ప్రజాపాలన ప్రతినిధి) : యువతలో రక్తదానంపై అవగాహన కల్పిస్తూ విశేష కృషి చేస్తున్న సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త కటుకం గణేష్ను పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశంసించారు.కోరుట్ల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కే.టీ.ఆర్ కు స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కటుకం గణేష్ ను పరిచయం చేస్తూ కోరుట్ల నియోజకవర్గం లోనే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రక్తదానంపై మహా ఉద్యమం నిర్వహిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి అని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించేది రక్తం,అందుకే రక్త దానాన్ని ప్రాణదానంతో సమానమని పురపాలక శాఖ మంత్రి కే.టీ.ఆర్ అన్నారు.ఆపత్సమయాలలో సకాలంలో రక్తం అందక ఎందరో మృత్యువాతకు గురవుతున్న సమయంలో యువతకు అవగాహన కల్పిస్తూ ఎందరో ప్రాణాలను కాపాడిన కటుకం గణేష్ అభినందనీయుడు అని కే.టీ.ఆర్ అన్నారు.