కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

Published: Wednesday January 18, 2023

కోరుట్ల, జనవరి 17 (ప్రజాపాలన ప్రతినిధి):
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా కేసీఆర్  బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు మొత్తం 15 చెక్కులు 15 లక్షల రూపాయలను లబ్ధిదారులకు అందించారు. మరియు కోరుట్ల పట్టణంలోని నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి తిలక్ హాస్పిటల్ ఖర్చుల సహాయం కోసం 1,25,000 విలువగల ఎల్ఓసిని  మంగళవారం రోజున కోరుట్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు చీటీ వెంకటరావు, ఎంపీపీ తోట నారాయణ,మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్, వైస్ చైర్మన్ గడ్డమీద పవన్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ, మరియు మండల అధ్యక్షులు అన్నం అనిల్ , దారిశెట్టి రాజేష్ , మరియు ఎంపీటీసీలు సర్పంచులు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.