ముక్తేశ్వర లిఫ్ట్ ద్వారా పంటలు ఎండి పోలేదు -సర్పంచ్ అనుమల తిరుపతి

Published: Tuesday March 16, 2021

వెల్గటూర్, మార్చ్14 (ప్రజాపాలన ప్రతినిధి) : తహసిల్ కట్టని వారు ఆరోపణల్లో వాస్తవం లేదు, పంటలు ఎక్కడ ఎండి పోలేదు ముత్తూనూర్ సర్పంచ్ అనుమల తిరుపతి వెల్గటూర్ మండలం లోని ముత్తునూర్ గ్రామ ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం మంత్రి కొప్పుల ఈశ్వర్ ముత్తునూర్, రాంనూర్ గ్రామాల రైతులకు వ్యవసాయ అవసరాల కోసం ఎంతో కష్టపడి మంత్రి మంజూరు చేయించారని అని సర్పంచ్ అనుమల తిరుపతి ఒక ప్రకటనలో తెలియజేశారు. రెండు గ్రామాలలో  రైతులు రెండు పంటలు పండించుకొంటూ సంతోషంగా ఉన్నారు. రైతుల వద్ద నుండి తహసిల్ వసూలు చేస్తూ ఎత్తిపోతల పథకానికి మరమ్మతులకు, మెయింటెనెన్స్ వినియోగిస్తున్నామని ఆయన తెలియజేశారు. పంటలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు బాగుచేసుకుంటూ నడుపుతూనట్ల ఆయన పేర్కొన్నారు. తహసిల్ కట్టని వారికి నీళ్లురావని చెప్పడం జరిగింది కానీ సాగునీరు బందుచేయలదు పంటలు ఎండబెట్టలేదు, రైతులందరు కలిసిమెలసి సక్రమంగా తహసిల్ చెల్లించుకుంటూ లిప్ట్ నడిపించుకుంటూ పంటలు పండించుకోవాలని కోరుకుంటున్నారు. కొంతమంది గిట్టనివాళ్ళ మాటలు, ఆరోపణలు పట్టించుకోవద్దు అని ఆయన గ్రామస్తులను కోరారు.