కరోనా పై విద్యార్థులకు అవగాహన దెందుకూరు గ్రామం

Published: Thursday September 16, 2021
మధిర, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున పిహెచ్సి దెందుకూరు వైద్య అధికారి ఆధ్వర్యంలో పారామెడికల్ సిబ్బంది హెచ్స్ ఆర్ సుబ్బలక్ష్మి మరియు హెచ్స్ లంకా కొండయ్య  హెచ్స్ కాంతలీల  ఎఎన్ఎం బృందం హెచ్ఎం నారాయణ దాసు ఆధ్వర్యంలో దెందుకూరు హైస్కూల్ విధ్యార్థిని, విధ్యార్థులకు కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్త లు తీసుకోవాలో సంపూర్ణముగా వివరించారు ముందుగా జానపద పాటల ద్వారా కొండయ్య చైతన్య పరిచి అనంతరం కోవిడ్ గురించి వివరించారు. ఈ సందర్బంగా సీనియర్ ఆరోగ్య పరివేక్షకురాలు ఆర్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ ప్రతి విధ్యార్థి సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్క్ తప్పని సరి అని ముఖ్యంగా హ్యాండ్ వాష్ ప్రతి సారీ చేయాలనీ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, వేడి వేడి ఆహార పదార్దాలు తినాలి, త్రాగు నీటి జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కె నారాయణ దాసు ఎఎన్ఎం కె రాజేశ్వరి, ఆశ టి సత్యవతి పాల్గొన్నారు.