వీఆర్ఏ లకు సంఘీభావం తెలిపిన తాసిల్దార్ డిప్యూటీ

Published: Wednesday August 03, 2022
తాసిల్దార్ మధిర ఆగస్టు 2 ప్రజాపాలన ప్రతినిధిమున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడువీఆర్ఏల సమ్మెకు సంఘీభావం తెలిపిన తాసిల్దార్ రాంబాబు, డిప్యూటీ తాసిల్దార్ రాజేష్ మరియు రెవెన్యూ ఉద్యోగులుపే స్కేల్ జీవో వెంటనే అమలు చేయాలని..వీఆర్ఏ ల సమస్యలను పరిష్కరించాలంటూ గత తొమ్మిది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తాసిల్దార్ కార్యాలయాల ముందు సమ్మె చేస్తున్న నేపథ్యంలో వీఆర్ఏ జేఏసీ -మధిర తాసిల్దార్ కార్యాలయం ముందు కొనసాగిస్తున్న సమ్మెకు మధిర తాసిల్దార్ రాంబాబు ,డిప్యూటీ తాసిల్దార్ రాజేష్ మరియు రెవెన్యూ ఉద్యోగులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ రాంబాబు మాట్లాడుతూ వీఆర్ఏల సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని నేడు వీఆర్ఏల సమ్మెపై ఖమ్మం కలెక్టర్ కు వినతులతో కూడిన నివేదిక ఇవ్వనున్నట్లు తెలియజేశారు.