సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల కేసీఆర్ కి కృతజ్ఞతలు జిల్లా టిఆర్ఎస్ నాయకులు కోట ర

Published: Saturday September 17, 2022
మధిర సెప్టెంబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు జిల్లా టిఆర్ఎస్ నాయకులు కెవిఆర్ హాస్పిటల్ అధినేత కోటా రాంబాబు సచివాలయం అంబేద్కర్ పెట్టడం పట్ల కెసిఆర్  కృతజ్ఞతలు తెలుపుతూ
ముఖ్యమంత్రి కెసిఆర్ ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కి అంబేద్కర్ పేరు పెట్టాలిఅంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం డాక్టర్ కోటా రాంబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ   ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయానికి  అంబేద్కర్ పేరు నామకరణం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కి టిఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం మధిర అంబేద్కర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా రాజ్యాంగంలో అవకాశం కల్పించడంవల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కోటా రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.