*ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు*

Published: Thursday April 06, 2023
మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 05, ప్రజాపాలన:   మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు కట్ట పైన వాకర్స్ సభ్యుల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతిని ఘనంగా నిర్వహించారు.అనంతరం  బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వాకర్స్ సభ్యులు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వం, అంటరానితనం నిషేధం, జమీందారీ వ్యవస్థ రద్దు వంటి మాలిక విషయాలను స్వాతంత్రానికి ముందే ప్రజలకు పరిచయం చేసిన సమతవాది బాబు జగ్జీవన్ రామ్ సామాజిక రాజకీయ ఉద్యమాలను ఏకకాలంలో నడిపిన యోధుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.ఆయన ఆశయ సాధన కోసం అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత కార్మిక సంఘం అధ్యక్షుడు, వాకర్ సభ్యుడు గజెల్లి వెంకటయ్య, రాష్ట్రపతి అవార్డు గ్రహీత యోగేశ్వర్, దేశం, అల్లం రాజయ్య, వీరశంకర్ తదితరులు పాల్గొన్నారు.
 *కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో* : మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు నివాస గృహంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి
పూలమాలలు వేసి నివాళులు అర్పించిన  పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.