కేంద్రీయ విద్యాలయాలు నైపుణ్యాలకు కేంద్రాలుగా మారాలి ఉత్తమ విద్యా బోధనకు అంకిత భావంతో కృషి

Published: Thursday July 07, 2022
కరీంనగర్ జూలై 6 ప్రజాపాలన ప్రతినిధి :
ఉత్తమ విద్యా బోధనకు కేంద్రీయ  విద్యాలయాలు అంకిత భావంతో కృషి చేసి నైపుణ్యాలకు కేంద్రాలుగా మారాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు.
 
బుధవారం ఎల్.ఎం.డీ. కాలనీలోని కేంద్రీయ విద్యాలయంలో మౌళిక వసతులపై ప్రిన్సిపల్స్, అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు.  కేంద్రీయ  విద్యాలయంలో తెలుగు మాతృ భాష ఉన్న విద్యార్థులకు తెలుగు భాష ఒకటవ తరగతి నుండి 5వ  తరగతి వరకు బోధించాలని కలెక్టర్ సూచించారు. విద్యా ప్రమాణాలు మెరుగు పడే విధంగా చూడాలని ప్రిన్సిపల్ ను కలెక్టర్ ఆదేశించారు. మాతృ భాష తెలుగులో కోరుకున్న వారికి 2022-23 విద్యా సంవత్సరంలో ప్రారంభించాలని తెలిపారు. మంచినీటి, ఆర్.ఓ. ప్లాంట్, క్రీడా ప్రాంగణాల అభివృద్ది, మౌళిక వసతుల కల్పన  ప్రతిపాదనలను కమిటీ ఆమోదించిందని అన్నారు. 
     
ఈ సమావేశంలో కళాశాలల ప్రిన్సిపల్స్ రామకృష్ణ, గొట్టిముక్కుల దేవెందర్, గండ్ర లక్ష్మణ్ రావు, బాలమణి, దుర్గా ప్రసాద్, మెడికల్ ఆఫీసర్, నారాయణ గీతా, సుశీల నాయుడు, శేష సాయి, పెంచాల శ్రీనివాస్, యం. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.