రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన విడుదల చేయాలి.

Published: Wednesday November 17, 2021
యువజన జాగృతి నాయకులు మంచర్ల సదానందం
మంచిర్యాల బ్యూరో, నవంబర్ 16, ప్రజాపాలన : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన విడుదల చేయాలని యువజన జాగృతి నాయకులు మంచర్ల సదానందం డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. నీళ్లు నిధులు నియామకాల పేరుచెప్పి కేసీఆర్ రాష్ట్ర సాధన ఉద్యమంలో నిరుద్యోగ బీసీ యువతను ఉద్యమంలో భాగస్వాములను చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అదికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ నియామకాలు పక్కన పెట్టి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని విమర్శించారు. స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తున్న కెసిఆర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు అవుతున్న నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం డిగ్రీలు పీజీలు చేసిన బీసీ నిరుద్యోగ యువత రాష్ట్రంలో 35 లక్షల మంది దిక్కు తోచక అమ్మానాన్నలు పోషించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. యువత ఆత్మహత్యలు ఆగాలన్న రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి యువతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గొల్ల మహేష్, కుంట సంతోష్, దాసరి శ్రావణ్, వెంకన్న, నాని, రమేష్, దామోదర్, సునీల్, శ్రీనివాస్, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు