ప్రజావాణిలో స్వీకరించిన సమస్యల పరిస్కరానికి ప్రత్యేక చర్యలు జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళి

Published: Tuesday July 19, 2022

 

మంచిర్యాల బ్యూరో, జూలై 18, సప్రజాపాలన:
 
 

ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న సమస్యల పరిష్కారం దిశగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కన్నెపల్లి మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన ముడిమడుగుల శంకర్ తన తండ్రి మొండయ్యకు మెట్పల్లి గ్రామ శివారులో భూమి ఉందని, ప్రభుత్వం నూతనంగా అందించి పట్టాదారు పాసుపుస్తకాలలో ఇతరుల పేరు నమోదు అయిందని, అట్టి పేరును తొలగించి తన తండ్రికి చెందిన భూమిని తన పేరిట మార్పుచేసి పట్టా మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో జూనియర్ సహాయ కులుగా పని చేస్తున్న బి. మోహన్ తన దరఖాస్తులో తాను ఆసిఫాబాద్లో విధులు నిర్వహిస్తుండగా జీ.ఓ. 317 అమలులో భాగంగా మంచిర్యాల జిల్లా పంచాయతీ కార్యాలయం నందు విధులు కేటాయిం చారని, ఇక్కడ పోస్టు ఖాళీగా లేనందున 6 నెలలుగా వేతనం రాకపోవడంతో కుటుంబ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, వేతనం ఇప్పించా లని కోరారు. జన్నారం మండలం పొనకల్ గ్రామపంచాయతీలో జూనియర్ సహాయ కులుగా పని చేస్తున్న ఆర్. రాహుల్ తాను నిర్మల్ జిల్లా ముథోల్లో విధులు నిర్వహిస్తుండగా ఇక్కడ విధులు కేటాయించారని, క్యాడర్ స్ట్రెంత్ లేని కారణంగా తన వేతన బిల్లు తిరస్కరిం చడం జరుగుతుందని, 6 నెలలుగా వేతనం రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, వేతనం ఇప్పించా లని కోరుతూ దరఖాస్తు అందజేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు 45వ ఐ.ఎల్.సి. సిఫారసుల ప్రకారం ఆశా వర్కర్లకు కనీస వేతనం, పెన్షన్, ఈ.ఎస్.ఐ. తదితర చట్టబద్ద సౌకర్యాలు కల్పించాలని, కరోనా సమయంలో అశా వర్కర్లు అందించిన సేవలు వెలకట్టలేనివని, వారికి నిర్ధిష్ట వేతనం నిర్ణయించి చెల్లించడంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దండేపల్లి మండల కేంద్రానికి బండారి మల్లేష్ తనకు జరిగిన ప్రమాదంలో నడుముకు దెబ్బ తగిలి రెండు కాళ్ళు పని చేయడం లేదని, తాను 10వ తరగతి చదువుకున్నానని, తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేతనాల చెల్లింపులో జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా కృషి చేయాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల బ్యూరో, జూలై 18, సప్రజాపాలన:
 
 

ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న సమస్యల పరిష్కారం దిశగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కన్నెపల్లి మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన ముడిమడుగుల శంకర్ తన తండ్రి మొండయ్యకు మెట్పల్లి గ్రామ శివారులో భూమి ఉందని, ప్రభుత్వం నూతనంగా అందించి పట్టాదారు పాసుపుస్తకాలలో ఇతరుల పేరు నమోదు అయిందని, అట్టి పేరును తొలగించి తన తండ్రికి చెందిన భూమిని తన పేరిట మార్పుచేసి పట్టా మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో జూనియర్ సహాయ కులుగా పని చేస్తున్న బి. మోహన్ తన దరఖాస్తులో తాను ఆసిఫాబాద్లో విధులు నిర్వహిస్తుండగా జీ.ఓ. 317 అమలులో భాగంగా మంచిర్యాల జిల్లా పంచాయతీ కార్యాలయం నందు విధులు కేటాయిం చారని, ఇక్కడ పోస్టు ఖాళీగా లేనందున 6 నెలలుగా వేతనం రాకపోవడంతో కుటుంబ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, వేతనం ఇప్పించా లని కోరారు. జన్నారం మండలం పొనకల్ గ్రామపంచాయతీలో జూనియర్ సహాయ కులుగా పని చేస్తున్న ఆర్. రాహుల్ తాను నిర్మల్ జిల్లా ముథోల్లో విధులు నిర్వహిస్తుండగా ఇక్కడ విధులు కేటాయించారని, క్యాడర్ స్ట్రెంత్ లేని కారణంగా తన వేతన బిల్లు తిరస్కరిం చడం జరుగుతుందని, 6 నెలలుగా వేతనం రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, వేతనం ఇప్పించా లని కోరుతూ దరఖాస్తు అందజేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు 45వ ఐ.ఎల్.సి. సిఫారసుల ప్రకారం ఆశా వర్కర్లకు కనీస వేతనం, పెన్షన్, ఈ.ఎస్.ఐ. తదితర చట్టబద్ద సౌకర్యాలు కల్పించాలని, కరోనా సమయంలో అశా వర్కర్లు అందించిన సేవలు వెలకట్టలేనివని, వారికి నిర్ధిష్ట వేతనం నిర్ణయించి చెల్లించడంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దండేపల్లి మండల కేంద్రానికి బండారి మల్లేష్ తనకు జరిగిన ప్రమాదంలో నడుముకు దెబ్బ తగిలి రెండు కాళ్ళు పని చేయడం లేదని, తాను 10వ తరగతి చదువుకున్నానని, తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేతనాల చెల్లింపులో జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా కృషి చేయాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.మంచిర్యాల బ్యూరో, జూలై 18, సప్రజాపాలన: