సమాజ సేవకు, వయస్సు, అనారోగ్యం అడ్డు కాదు.

Published: Monday November 22, 2021
మధిర నవంబర్ 21 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ ప్రజలుసమాజంలో, పీడితులకు సేవలు అందించుటకు, వయస్సు, అనారోగ్యం అడ్డు కాదన్నారు, "వరిష్ఠ నాగరిక  సేవాసంఘం" అధ్యక్షుడు మాధవరపు నాగేశ్వరరావు.కరోనా బారినపడి, భగవంతుని కృపతో కోలుకుని, తమ వయస్సు, అనారోగ్యం పరిగణన లోకి తీసుకోకుండా, రెట్టించిన ఉత్సాహంతో, తమ సేవా కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్న, నలుగురు సమాజ సేవకులను, ఈరోజు, మధిర "వరిష్ఠ నాగరిక సేవా సంఘం" ఆధ్వర్యంలో శాలువా, పండ్లు సమర్పించి, ఘనంగా సత్కరించారు. దశాబ్దానికి పైగా, 'ఉచిత హోమియో శిబిరం' ద్వారా సేవలు అందిస్తున్న, సంక్రాంతి శ్రీనివాసరావు, బొగ్గవరపు హరీష్, 'సత్యసాయి ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం' ద్వారా సేవలందిస్తున్న సూరిసెట్టి అనంతయ్య, పెరుమాళ్ళ సత్యనారాయణ గార్లను కోనా మోహనరావు  అందుబాటులో లేరు), సత్కరించారు. ఈ కార్యక్రమంలో వరిష్ఠ నాగరిక సేవా సంఘ బాధ్యులు, పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్, శ్రీమతి ఎండ్రపల్లి పద్మావతి, బాబ్ల, రామా స్టూడియో నాగ భూషణం, అవ్వా రమణా రావు, శ్రీమతి కోనా లక్ష్మీ మోహనరావు, నవీన్, ఖాసిం తదితరులు పాల్గొన్నారు: మాధవరపు నాగేశ్వరరావు, అధ్యక్షుడు, వరిష్ఠ నాగరిక సేవా సంఘం, మధిర.