మధిరలో 100 పడకల ఆసుపత్రికి సీఎల్పీ లీడర్

Published: Thursday June 10, 2021

మధిర, జూన్ 09, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీశ్రీ మల్లు భట్టి విక్రమార్క కృషి మరువలేనిదిఖమ్మం జిల్లా మధిర పట్టణంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటీవల మధిర నియోజకవర్గ శాసనసభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధిర పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మధిర సామాజిక ఆరోగ్య కేంద్రంలోని సమస్యలను మరియు ప్రభుత్వ ఆసుపత్రికి కావలసిన పరికరాలను దృష్టిలో ఉంచుకొని మధిర వైద్యశాలను వంద పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంకు  తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం మధిర ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేస్తూ ఆమోదాన్ని తెలిపింది. ఈ సందర్భంగా మధిర మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు  సూరం శెట్టి కిషోర్, మిరియాల రమణ గుప్తా మాట్లాడుతూ మధిర నియోజకవర్గ శాసన సభ్యుని కృషితో నేడు మధిర  ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా ఆమోదం పొందిందని. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కృషి మారువలేనిదని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, మధిర మండల ఎస్సి సెల్ అధ్యక్షులు దా రా బాలరాజు, సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు, ఎస్కే జాంగిర్, నాయకులు పతేవరపు సంగయ్యజింకల కోటేశ్వరరావు, మైలవరపు చక్రి తదితరులు కృతజ్ఞతలు తెలిపినారు