చేప పిల్లలను పంపిణీ చేసిన బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ,మార్కెట్ కమిటీ చైర్మన్ పో

Published: Thursday November 03, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లోని కృష్ణ సాగర్, నకిరేపేట పెద్ద చెరువు, బూర్గంపాడు కొల్లు ,చెరువులలో మత్స్యకారులు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేప పిల్లల ను చెరువులలో... బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొడియం ముత్యాలమ్మ, బుధవారం నాడు వదిలారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను వారి వృత్తుల ద్వారా ప్రోత్సహిస్తున్న వారిని అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్  లక్ష్యమని అన్నారు, మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టింది అన్నారు, చేపలు విక్రయించడానికి 70 శాతం సబ్సిడీతో ద్విచక్ర వాహనాలు కూడా పంపిణీ చేసేమన్నారు, తెలంగాణ రాష్ట్రం మత్యసంపద అభివృద్ధి సాధించడమే కాకుండా వినియోగంలోనూ పురోగతిలో ఉందన్నారు, దేశంలో అత్యధిక ఎక్కువగా చేప పిల్లలు చేస్తున్నది తెలంగాణ రాష్ట్రమే అని, ఇది తెలంగాణకు గర్వకారణమని అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడ అమలు కావడం లేదని అన్నారు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, 24 గంటల ఉచిత విద్యుత్ ఇటువంటి అనేక పథకాలు అమలవుతున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు స్థానిక ప్రజలు, పలువురు  టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.