తడి పొడి చెత్త వాడకం పై పాఠశాలలో అవగాహన

Published: Wednesday January 25, 2023
జన్నారం, జనవరి 23, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల ప్రకారం మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లోని పాఠశాలలో పొడి చెత్త, తడి చెత్త వాడకం, గురించి మంగళవారం ఎంఈఓ విజయ్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్లలే దేశానికి గర్వకారణని ఆడపిల్ల దినోత్సవం సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. మండలంలో ఉన్న పాఠశాలలో తడి పొడి చెత్త వలన పునర్వినియోగ, వాటివలన ఎరువు తయారీ విధానంపై పాఠశాలలను విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా విద్యార్థులు చదువుతోపాటు అటలా పోటీలలో రాణించాలని జన్నారం ఉపసర్పంచ్ జంగం రవి అన్నారు. ఐటిఐ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు వివిధ రకాల పోటీలకు సంబంధించిన సామాగ్రిని ఆయన అందజేశారు. ఈ ఐటిఐ కళాశాలలో సామాగ్రిని అందజేసి సమయంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జాడి గంగాధర్, సర్పంచ్ జగ్గు భూమేష్, జూనియర్ అసిస్టెంట్ రాహుల్, బిల్ కలెక్టర్ అనిల్, ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మండల ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లు, అధికారులు, పాల్గొన్నారు