దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి ** లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం ** ఎమ్మెల్యే ఆ

Published: Thursday November 03, 2022
ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 02 (ప్రజాపాలన, ప్రతినిధి) : దళిత బంధు పథకంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా స్థిరపడాలని లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ లోని టాటియా గార్డెన్ లో దళిత బంధు లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో కలెక్టర్ తో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప, అడిషనల్ కలెక్టర్ చాహాత్ బాజ్పాయ్, పాల్గొని మాట్లాడుతూ దళిత బంధు కోసం లబ్ధిదారులు ఎవరికి కమిషన్లు ఇవ్వరాదని ప్రభుత్వం ఈ పథకాన్ని ఉచితంగా అమలు చేస్తుందని అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితులపై ప్రత్యేక శ్రద్ధ వహించి రూపాయలు 10 లక్షలు అందజేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారులు, పిడి డిఆర్ఓ, ఎస్సీ వెల్ఫేర్ జెడి, సిపిఓ, ఏపీఎంలు, జిపి కార్యదర్శిలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.