నీర్మాల గ్రామం లో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు -శ్రీనివాస్ రెడ్డి

Published: Tuesday July 12, 2022
జనగాం జిల్లా 11 జులై ప్రజాపాలన:
కాలానుగుణంగా వచ్చే అంటు  వ్యాధులు ప్రబలకుండా దేవరుప్పుల ప్రాథమిక వైద్య మరియు ఆరోగ్య కేంద్రం ఆద్వర్యంలో నీర్మాల్ గ్రామ పంచాయతీ పరిధిలో వైద్య  ఆరోగ్య శిబిరం నిర్వహించినారు.
జనగాం జిల్లా దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య పరిధిలోని నీర్మాల గ్రామ పంచాయతీ లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా సోమవారం నాడు వైద్య  ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినట్లు సంబంధిత డాక్టర్ కిషోర్ తాల్క తెలియజేశారు.
నీర్మాల గ్రామ సర్పంచ్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, దేవరుప్పుల జిల్లా ప్రాయోజిత సభ్యురాలు పల్లా బార్గవి సుందరం రెడ్డి ల ఆద్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారని తెలియజేశారు. 
 అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది సలహా సూచనల ను తప్పకుండా పాటించాలని సంబంధిత సర్పంచ్ జడ్పిటిసి లు ప్రజలకు తెలియజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చేపట్టిన వైద్య శిబిరాలను ప్రజలు ఉపయేగించు కోవాలని మీడియా ద్వారా కోరారు. వర్షాకాలం లో వేడి ఆహారం మరియు కాచి వడపోసిన నీటిని తీసుకోవాలని డాక్టర్ కిషోర్ తాల్క ప్రజలకు సూచించారు. 
 
 ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడికల్ ఆఫీసర్ - వెంకటస్వామి, హెల్త్ సూపర్‌ వైజర్ సత్యనారాయణ, హెల్త్ అసిస్టెంట్ రామ్మూర్తి, ఏ.ఎన్.ఎమ్. దేవేంద్ర,  మరియు ఆశా వర్కర్  కవిత తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area