రేడియల్ రోడ్డు విస్తీర్ణంలో అయోమయంగా ప్రజలు

Published: Thursday February 11, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్ ; రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో నీ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిధుల కేటాయింపులో వివక్ష తగదు..... అంటూ కార్పొరేషన్ బిజెపి కార్పొరేటర్లు వ్యక్తపరిచారు. బడంగ్ పేట్ కార్పొరేషన్ లో నిన్న జరిగిన కౌన్సిలింగ్ సమావేశంలో అధికార పార్టీలోనీ కొందరు సభ్యులకు ఎక్కువ.. ఇతర సభ్యులకు తక్కువ నిధులు కేటాయించిన వాటిలో వివక్ష  చూపుతున్నారంటూ బిజెపి కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. మిగిలిన కాంగ్రెస్ కార్పొరేటర్లు అసంతృప్తిని వ్యక్తపరిచారు. అదేవిధంగా బడంగ్ పేట్ కమాన్ నుండి నాదర్గుల్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల వరకు మెయిన్ రోడ్డుకు 7.50 లక్షల వ్యయంతో కార్పొరేషన్  ఎల్ ఆర్ ఎస్ ఫండ్ కౌన్సిలింగ్ మీటింగ్ లో నిర్ధారించారు. కానీ ప్రజలకు పెద్ద నష్టం కలిగించే అవకాశం కనిపిస్తోందినీ, మహేశ్వరం నియోజక వర్గ ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రోడ్డు విస్తీర్ణం లో 150 ఫీట్లను 100 ఫీట్ లకు కుదించమని వారన్నారు. కౌన్సిలింగ్ మీటింగ్ లో హెచ్ ఎం డి ఎ నిర్ధారించిన తర్వాత వంద  ఫీట్స్  ఎలా నిర్ధారిస్తారునీ బిజెపి కార్పొరేటర్లు ప్రశ్నించారు....?
రేడియల్ రోడ్డు విస్తరణలో అయోమయంజరుగుతుందని అన్నారు. ఎజెండా మీటింగ్ లో బడంగ్ పేట మేయర్ పై బీజేపీ కార్పొరేటర్ల ప్రోటోకాల్ పాటిస్తే లేరని విమర్శనాస్త్రాలు చేశారు. నాదర్ గుల్ లోని కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  కార్పొరేషన్ భాజపా కార్పొరేటర్లు మాట్లాడుతూ...... తెలంగాణ సర్కార్ నుంచి బడంగ్ పేట కార్పొరేషన్ కు రాష్ట్ర విద్యాశాఖమంత్రి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.  ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా సమాన హక్కులు కలిగి ఉంటారని గుర్తుచేశారు. బడంగ్ పేట కార్పొరేషన్ నిధులను బీజేపీ కార్పొరేటర్లకు తక్కువగా... టీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఎక్కువగా కేటాయింపులు చేస్తున్నారని శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో సమాన కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. చెరుకు పల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ..... బడంగ్ పేట్ కమాన్ నుండి జనప్రీయా విలాస్  వరకు  మంత్రి గారు చెప్పారు. ప్రజలు నిర్దిష్ట నిర్ణయము చెయ్యలేక ఇలా అనడం సమంజసం కాదన్నారు.   ఇదే ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో అధికారులు, మేయర్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బడంగ్ పేట నుండి నాదర్ గుల్ రేడియల్ రోడ్డు విస్తరణలో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా అధికారులు, స్థానిక మంత్రి సబితమ్మ ప్రజలను అయోమయానికి గురి చేస్తుందన్నారు అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి. మంత్రి హోదాలో ఉండి  అవగాహన లేకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం ఎంత వరకు సమంజసం అన్నారు. ఎల్ఆర్ఎస్ నిధులతోపాటు మరిన్ని ప్రభుత్వ నిధులు తెచ్చి రోడ్ల విస్తరణ చేపట్టాలని కోరారు. కార్పొరేషన్ బిజెపి ఫ్లోర్ లీడర్ తోట శ్రీధర్ రెడ్డి, ఉప ఫ్లోర్ లీడర్ దడిగే శంకర్ అధికారంగా నిర్వహిస్తారాని సభా ముఖంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట కార్పొరేటర్లు దడిగె శంకర్, పద్మా ఐలయ్య యాదవ్, మాధురి వీరకర్ణారెడ్డి, గడ్డం లక్ష్మారెడ్డి, గుడెపు ఇంద్రసేనా, నిమ్మల సునీతా శ్రీకాంత్ గౌడ్, అమితా శ్రీశైలం చారి, బంగారు అనితా ప్రభాకార్, గౌర రమాదేవి శ్రీనివాస్, సహా బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 
Attachments are