డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులపై కళా ప్రదర్శనలు..

Published: Thursday September 29, 2022
హాజరైన గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత..
తల్లాడ, సెప్టెంబర్ 28 (ప్రజా పాలన న్యూస్):
 తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో  డెంగ్యూ, చికెన్ గున్యా తదితర సీజనల్ వ్యాధులపై బుధవారం కళాకారులు అవగాహన కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కళాజాత ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ఈ కార్యక్రమానికి అన్నారుగూడెం గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత హాజరై కళాజాతాను వీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలు ఇళ్లలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపి, ఏఎన్ఎం పద్మావతి, కళాజాత సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు