జిల్లా లో బిజెపి విజయోత్సవ సంబురాలు

Published: Friday July 22, 2022
మంచిర్యాల బ్యూరో, జులై21, ప్రజాపాలన:
భారత రాష్ట్రపతిగా ఎన్డిఎ అభ్యర్ధి మొదటి గిరిజన మహిళ,  ద్రౌపది ముర్ము  ఘన విజయం సాధించడంతో ఆపార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం బిజేపి నాయకులు మంచిర్యాల జిల్లా లో విజయోత్సవ సంబురాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  అధ్వర్యంలో  మంచిర్యాల పట్టణంలోని అర్చన టెక్స్ చౌరస్తా నుండి ముఖరమ్ చౌరస్తా, వాటర్ ట్యాంక్, వెంకటేశ్వర్ టాకీస్  గుండా అర్చన టెక్స్ చౌరస్తా వరకు దండెపెల్లి మండలం  కోయపోచ గూడెం గిరిజన మహిళలలతో కలిసి ర్యాలీ నిర్వహించి  సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రఘునాథ్  మాట్లాడుతూ గిరిజన మహిళ రాష్ట్రపతిని చేయడం నరేంద్ర మోదీ  నాయకత్వంలో కేవలం భారతీయ జనతా పార్టీకి సాధ్యం అని అన్నారు. ఇది విజయం దేశంలో గిరిజనుల అందరి  అని అన్నారు. ఒక వైపు కేసిఆర్ రాష్ట్రంలో గిరిజనుల పై అక్రమ కేసులు పెడుతుంటే మరో వైపు మోడీ  గిరిజనుల అభివృద్ధి కి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు బద్రి నాయక్, మున్నరాజా సిసోడియా, వంగపల్లి వెంకటేశ్వర్ రావు,బొయిని హారి కృష్ణ, రజినిష్ జైన్, తుల ఆంజనేయుయులు, గాజుల ప్రభాకర్, తుల మధుసూధన్, కోయపోచ గూడెం క్రిమినల్ గిరిజన మహిళలు మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.