పండుగకు ఊరు వెళ్తున్నారా... జర పైలం

Published: Wednesday January 11, 2023
* పట్టణ సీఐ టంగుటూరి శ్రీను
వికారాబాద్ బ్యూరో 10 జనవరి ప్రజా పాలన : సంక్రాంతి పండుగ సెలవులకు ఊరు వెళ్లే వారు సూచించిన నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలని పట్టణ సిఐ టంగుటూరి శ్రీను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ టంగుటూరి శ్రీను మాట్లాడుతూ ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, హర్ ఏక్ మాల్ వస్తువులను విక్రయించే వారి పై "నిఘా " పెట్టాలని సూచించారు. రాత్రయితే అనుమానంగా సంచరించే వారిని పలుకరించాలన్నారు. శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకటం,రాత్రి వేళ చోరీలకు పాల్పడుతున్నారన్నారు. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చినమ్మి వెళ్లకూడదని హెచ్చరించారు. ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పాలని తెలిపారు. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని వచ్చేలా ప్రణాళిక వేసుకోవాలని హితవు పలికారు. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరారు. ఇంట్లోని కుటుంబ సభ్యులు వెళ్లినప్పుడు ఇంట్లో ఉన్న మహిళలు, వృద్ధులు "అపరిచితులు " సమాచారం పేరుతో వస్తే నమ్మవద్దన్నారు. ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఉంచకపోవడమే మంచిది. బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం మరవద్దన్నారు. కాలనీల వారిగా "గస్తీ " దళాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీసమీప పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని చెప్పారు. పోలీస్ శాఖ వారికి దొంగతనాలపై అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించాలన్నారు. ప్రత్యేకంగా మీ చుట్టు ప్రక్కల వారి ల్యాండ్ ఫోన్ నెంబరు, సెల్ ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉంచుకోగలరని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించండి. డయల్ 100 ను సద్వినియోగం చేసుకోండి.