సీఎంఆర్ బియ్యన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి

Published: Saturday July 02, 2022
మంచిర్యాల టౌన్, జూలై 01, ప్రజాపాలన :  *సీఎంఆర్ బియ్యన్ని  కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శుక్రవారం రోజున ధర్నా, అనంతరం కలెక్టర్ కార్యాలయ ఎ ఒ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కష్టం మిల్లింగ్ రైస్ ను 2022 జూన్ 7వ తేదీ నుండి నిలుపుదల చేశారు. ఫలితంగా రాష్ట్రంలో 1500 రైస్ మిల్లులు మూత పడ్డాయి. దాంతో సుమారు రెండు లక్షల మంది హమాలీ కార్మికులతో పాటు మిల్లు డ్రైవర్లు, దినసారి కూలీలు, గుమస్తాలు, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, ఇతర రైస్ మిల్లు ఆధారిత కార్మికులు పనులు కోల్పోయారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు   పనులు కోల్పోయి సొంత రాష్ట్ర లకు తిరిగి వెళ్లారు. ఈ సమస్యలకు పరిష్కారం వెతకాల్సింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం  స్పందించి వెంటనే ఎఫ్సీఐ ద్వారా సీఎంఆర్ బియ్యన్ని కోనుగోలు చేసి పేదలకు ఉచితంగా బియ్యం సరఫరా చేస్తూ  రైస్ మిల్లు ఆధారత కార్మికులకు ఉపాధి కల్పించాలని   డిమాండ్ చేశారు.లేనియెడల పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పారా బయల్డ్ రైస్ మిల్ హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఇంగు రామచందర్, సభ్యులు రాజయ్య, జయరాజ్, లక్ష్మణ్, మల్లేష్, నరేష్, పోచయ్య, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.