మానసిక వికలాంగుల అభాగ్యులు భూదాన యజ్ఞం ప్రారంభోత్సవం

Published: Monday March 29, 2021
బాలాపూర్, మార్చి 28, ప్రజాపాలన ప్రతినిధి: మాతృదేవోభవ అనాధ ఆశ్రమం అభాగ్యులకు సొంత గూడు కోసం  ఎదురుచూస్తున్న మానసిక వికలాంగులు, అదేవిధంగా మీరు చేసే సహాయం గోమాతల కూడా నీడనిస్తుంది... బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో ఉన్నటువంటి మాతృదెవోభవ అనాధ ఆశ్రమం అభాగ్యులకు అన్నదానం తోపాటు సొంత గూడు ఉండాలని మానసిక వికలాంగులు, అదేవిధంగా  గోశాలకోసం శాశ్వతంగా 1.000 గజల స్థలం, భవన నిర్మాణం కోసం భూదాన యజ్ఞం కార్యక్రమనికి ఆశ్రమం వ్యవస్థాపకులు దాతలను కోరారు. ఎందుకంటే మానవసేవే మాధవసేవ అనే దృక్పథంతో ముందుకు వెళ్తున్న ఇన్ని రోజులు అద్దె లో ఉంటూ అభాగ్యుల ఆదుకో లేక పోతున్నాను, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక నాయకులు అన్నం పెట్టి ఆదరిస్తున్నారు కానీ గూడు కోసం ఎదురుచూపులు మిగిలిపోయాయినీ ప్రాధేయ పడుతూ భూదాన యజ్ఞ మొదలుపెట్టారు. భూదాన యజ్ఞం లో మొదటి దాత సైదాబాద్ సరస్వతి నగర్ నివాసులు అయినటువంటి వల్లిశేటి లక్ష్మి శేఖర్ శారదా దంపతులు వారి కుటుంబ పెద్దలు కి,,శై,, స్వర్గీయ వల్లి శెట్టి పరుశరాములు లింగమ్మ దంపతుల గారి జ్ఞాపకార్థంగా 11గజముల కోసం రూ, (1,11,114 రూపాయలు) ఒక లక్ష పదకొండు వేల నూట పద్నాలుగు రూపాయలు విరాళంగా అందజేశారు. ఆశ్రమ వ్యవస్థాపకుడు గట్టు గిరి మాట్లాడుతూ..... మాతృదేవోభవ అనాధ ఆశ్రమం మానసిక వికలాంగులకు ఆశ్రమం కోసం శాశ్వత స్థలము, భవనముల నిర్మాణనికై అదేవిధంగా గోమాతల సంరక్షణకై గోశాల నిర్మాణం కోసం ఈ భూదాన యజ్ఞం బృహత్తరమైన సేవా కార్యక్రమంలో భాగంగా మానవత హృదయులు కలిగిన దాతలు అందరికీ విన్నపం కోరుతున్నారు. ప్రతి ఒక్కరికి  అభాగ్యుల సొంతగూడు కోసం సహయ, సహకరములు అందించే వారందరికీ మాతృదేవోభవ అనాధ ఆశ్రమ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఆశ్రమం స్థలం కోసం ప్రతిఒక్కరు దాతలు సహయ, సహకరములు అందించాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నారుని అన్నారు.