తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

Published: Friday March 12, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 11 ( ప్రజాపాలన ) : ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపారని టిఆర్ఎస్ యువజన ఉపాధ్యక్షుడు కడియాల వేణుగోపాల్ ముదిరాజ్, 22వ వార్డు కౌన్సిలర్ సుధాంష్ కిరణ్ పటేల్ లు తెలిపారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు, 22వ వార్డులలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచార పర్వాన్ని నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు ప్రైవేటు రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించామని వివరించారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్. వాణీదేవి మన దేశ ఆర్ధిక సంస్కరణల పితామహుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె అని గుర్తు చేశారు. 35 ఏండ్లుగా విద్యారంగంలో, సామాజిక రంగంలో అనేక సేవలు అందిస్తూ, పట్టభద్రులు, నిరుద్యోగులు, టీచర్లు, మహిళల సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న వాణి దేవి (క్రమ సంఖ్య -4) కి మీ అమూల్యమైన మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దత్తు, షరీఫ్, కేదార్ నాథ్, సిద్దిక్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.