డాక్టరేట్ అవార్డు అందుకున్న మద్దెల ప్రసాదరావు

Published: Monday July 11, 2022
మధిర జూలై 10 ప్రజా పాలన ప్రతినిధి
 తమిళనాడు హైకోర్టు జడ్జి వల్లి నాయగం చేతుల మీదుగా డాక్టరేట్ అవార్డు అందుకున్న మద్దెల*

 పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుండి సీఐ వరకు విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన మద్దెల ప్రసాదరావు సామాజిక సేవా కార్యక్రమాల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించి ఈరోజు చెన్నైలో ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తమిళనాడు శాఖ ద్వారా డాక్టరేట్ అవార్డు పొందారు. ఈ అవార్డును తమిళనాడు హైకోర్టు జడ్జి మరియు నేషనల్ సైబర్ క్రైమ్ మరియు సెక్యూరిటీ చైర్మన్ వల్లి నాయగం మరియు సంస్థ ఇంటర్నేషనల్ చీప్ ఎర్లీన్ చేతులు మీదగా అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఖమ్మం జిల్లాకు చెందిన మద్దెల ప్రసాదరావు పోలీస్ శాఖలో ఉత్తమ అధికారిగా అనేక అవార్డులు పొందారు. పదవి విరమణ అనంతరం తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల స్థాపించిన వైయస్సార్ తెలంగాణ పార్టీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా దళిత విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేశారు. మద్దెల ప్రసాదరావు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి తమిళనాడు శాఖ డాక్టరేట్ అవార్డుకు ఎంపిక చేసి ఈరోజు అందించారు