శాంతి భద్రతల తోపాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే : నెన్నెల ఎస్ ఐ సౌమ్యా రెడ్డి

Published: Wednesday February 16, 2022
బెల్లంపల్లి ఫిబ్రవరి 15 ప్రజాపాలన ప్రతినిధి: ప్రజల సమస్యల పరిష్కారం, భద్రతతో పాటు ప్రజల ఆరోగ్యం కోసం కూడా పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని నెన్నెల ఎస్ఐ సౌమ్య రెడ్డి అన్నారు. మంగళవారం నాడు రామగుండం పోలీస్ కమిషనరేట్ బెల్లంపల్లి సబ్ డివిజన్ లోనీ నెన్నెల పోలీస్ స్టేషన్ పోలీసులు, చైల్డ్ లైన్ వారి సహకారంతో కొత్తూరు గ్రామంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఐ సౌమ్యా రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత దగ్గర అవ్వడానికి, పోలీస్ ఉన్నది మీకోసం, మీ భద్రత కోసమే, మీ ఆరోగ్యం కోసం అనే నమ్మకం కలగడం కోరకు ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందనీ అన్నారు. పోలీసు ఎన్నో సేవా, కమ్యూనిటీ, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తు ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేస్తూ అందుబాటులో ఉంటుందనీ అన్నారు. ప్రజల శాంతి భద్రత తో పాటు ఆరోగ్యాన్ని కాపాడడం కూడా ముఖ్యంగా భావించి నిపుణులైన డాక్టర్ల బృందాన్ని పిలిపించి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. వచ్చిన అందుబాటులో ఉన్న వైద్యులచే వివిధ రకాల తమ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పరీక్షలను చేపించుకొని మెడికల్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకొని ఆ సమస్యలను తొలగించుకోవాలని సూచించారు. మారుమూలన ఉన్న గ్రామాల్లో ఉంటున్న ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈ ఉచిత మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేశామని, ఉచిత వైద్య శిబిరాని కి అడగానే  వచ్చిన నేన్నెల ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ రవికుమార్ కు, వారి సిబ్బందికి, చైల్డ్ లిన్డ్ డైరెక్టర్ జిజో బృందం సభ్యులకు, ఎంపీపీ రమాదేవికి, సహచర పోలీస్ సిబ్బందికి మండలంలోని ప్రజా ప్రతినిధులకు, క్యాంపు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.