నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలి ** ఎస్ఎఫ్ఐ(మాజీ) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కార్

Published: Tuesday November 08, 2022

ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 07 (ప్రజాపాలన, ప్రతినిధి) : భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభల సందర్భంగా నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపి)పై సోమవారం మోడల్ డిగ్రీ కళాశాలలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గొడిసెల కార్తీక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం విద్యారంగంలో అసమానతలు పెంచుతుందన్నారు. పేదవారిని విద్యకు దూరం చేయడంలో భాగమే ఈ విద్యా విధానం అన్నారు. విద్యా వ్యవస్థను కార్పోరేట్లకు కట్టబెట్టి పేదవారికి విద్య అందని ద్రాక్షగా మారుస్తున్నారని, దేశానికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టే  ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయి కృష్ణ మాట్లాడుతూ 17వ అఖిలభారత మహాసభలు  డిసెంబర్ 13 నుండి 16 వరకు హైదరాబాదులో జరగబోతున్నాయని, ఈ సభలో భవిష్యత్తు దేశవ్యాప్త ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమ నిర్మాణం కోసం కార్యచరణ రూపొందిస్తామన్నారు. ఎన్ఈసి, ఆర్ఎస్ఎస్, బిజెపి, ప్రయోజనాల కోసం విద్యని కాషాయ మయం మేడం కోసం తీసుకువచ్చారని విమర్శించారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సతీష్, జాఫర్, సాయి చరణ్ విద్యార్థులు పాల్గొన్నారు.