రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్

Published: Wednesday August 24, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 23ప్రజాపాలన ప్రతినిధి.

ఈ నెల 25న. ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  చేతులమీదుగా రంగారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయాల ప్రారంభోత్సవానికి రానున్న సందర్భంగా  జిల్లాల అధికారులు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు   విద్యాశాఖ మంత్రి  సబిత ఇంద్రారెడ్డి, ఎంపీ  రంజిత్ రెడ్డి,జెడ్పీ చైర్మన్  అనిత రెడ్డి, ఎమ్మెల్సీలు  యెగ్గే మల్లేశం,  దయానంద్ గుప్తా,  పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు  సుదీర్ రెడ్డి,   ప్రకాష్ గౌడ్,  యాదయ్య, జైపాల్ యాదవ్, జిల్లా కలెక్టర్  అమోయ్ కుమార్, సీపీ  మహేష్ భగవత్, అదనపు కలెక్టర్  ప్రతిక్ జైన్, డీసీసీబీ చైర్మన్  బుయ్యని మనోహర్ రెడ్డి కలిసి అధికారులతో సమీక్షించి, పనులను పరిశీలించిన టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ  ఆదిభట్ల సమీపంలో ఉన్న నూతన కలెక్టర్ భవనాన్ని ప్రారంభానికి ముఖ్యమంత్రి గారు రావడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే తెలిపారు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న జిల్లా నలుమూలల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉందని ప్రజలు సద్వినియోగం  చేసుకోవాలని  హైదరాబాద్ వెళ్లకుండా ప్రజలకు కష్టాలు తప్పివని ఒకరికొకరు అనుకుంటున్నారు కలెక్టర్ కార్యాలయం  మన దగ్గరికి రావడం సంతోషకరమని ప్రజలు తెలుపుతున్నారు ఎమ్మెల్యే తెలియజేశారు. కార్యక్రమానికి ప్రజలందరూ భాగస్వాములై బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.