కేసీఆర్ వాక్యాల పై జిల్లాలో నిరసనలు.

Published: Friday February 04, 2022
కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం, నల్లబ్యాడ్జీలు లతో నిరసనలు.
జై బీం దీక్షలు చేపట్టిన బిజెపి 
నల్లబ్యాడ్జీలు దరించి అంబెడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసిక కాంగ్రెసు.
మంచిర్యాల బ్యూరో‌, పిబ్రవరి 03, ప్రజాపాలన : భారత రాజ్యాంగం మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జిల్లా లో తీవ్ర దుమారం రేపుతోంది. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు వేరువేరుగా గురువారం నిరసనలు చేపట్టారు. రాజ్యాంగ పట్ల విశ్వసనీయత లేని ముఖ్యమంత్రి భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికైన కేసీఆర్ తక్షణమే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వాక్యాలు అధికారపార్టీ లోని దళిత ప్రజాప్రతినిధులు సమర్ధించడం దురదృష్టం అని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే అంబెడ్కర్ ను అవమానపరచడమే అని బహుజన సంఘాల నేతలు విమర్శించారు.
నల్లబ్యాడ్జీలు దరించి కాంగ్రెస్ నిరసన
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వాక్యాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆ పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు దరించి అంబెడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు., పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంచి బుద్ది ప్రసాదించాలని కోరారు. కేసీఆర్ వ్యాఖ్యలు యావత్ దేశ ప్రజలను ఆవేదనకు గురి చేసిందని మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు రావుల ఉప్పలయ్య అన్నారు. రాజ్యాంగ ము కల్పించిన హక్కు ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం కెసిఆర్ మర్చిపోయారని ఆయన ఎద్దేవాచేశారు.కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపాలిటీ ఫ్లోర్లీడర్ రావుల ఉప్పలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బాణేష్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జంగపల్లి బాబాన్న, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వడ్డే రాజమౌళి, సింగల్ విండో డైరెక్టర్ తూముల వెంకటేష్, పట్టణ ఉపాధ్యక్షుడు జోగుల సదానందం, నాయకులు, కొండ శేఖర్, సూరం సతీష్, విజయ్, తోట మల్లయ్య, లలిత, పుట్ట లావణ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎస్ఎప్ఐ అద్వర్యం లో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
భారత రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం వ్యాఖ్యలు నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లక్షేట్టి పేట పట్టణంలో సీఎం దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.భారత రాజ్యాంగాన్ని మార్చడం అంటే భారత ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టడమే అని ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు.' మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, తక్షణమే కెసిఆర్ భారత సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు భైరం లింగన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా యువజన కార్యదర్శి ధర్మాజీ శ్రీకాంత్, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి శ్రీరాముల వెంకటేష్, దిలీప్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, మనోజ్, ప్రవీణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
భీం దీక్ష చేపట్టిన బిజెపి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడిన మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ అధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద  బిజెపి భీం దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం ఐబీ చౌరస్తా లో కేసిఆర్ దిష్టి బొమ్మ కు శవ యాత్ర నిర్వహించి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, ముల్కల్ల మల్లరెడ్డి, అందుగుల శ్రీనివాస్, కొయ్యల ఏమజి, రజినిష్ జైన్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, రేకందర వాణి, తుల ఆంజనేయులు, పట్టి వెంకట కృష్ణ, జోగుల శ్రీదేవి, పత్తి శ్రీనివాస్, బొద్దున మల్లేష్, బియ్యాల సతీష్ రావు, తుల మధుసూధన్ రావు, రంగ శ్రీశైలం, బోయిని హరికృష్ణ, గాజుల ప్రభాకర్, ఆగల్ డ్యూటీ రాజు, మద్ది శంకర్, వేల్పుల శ్రీనివాస్, మోటపలుకుల తిరుపతి, బేర ప్రభాకర, ప్రభ, రావుల లక్ష్మన్, నాగుల రాజన్న, బద్దరపు రాజమౌళి, రాచకొండ సత్యనారాయణ, ఆకుల సంతోష్, సోమ ప్రదీప్ చంద్ర, పల్లి రాకేష్ మరియు తదితరులు పాల్గొన్నారు