వ్యక్తిత్వ వికాసానికి దిక్సూచి రామాయణం

Published: Monday November 29, 2021
ఎబిఎస్పి అధ్యక్షులు కసిరెడ్డి వెంకట్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 28 నవంబర్ ప్రజాపాలన : వ్యక్తిత్వ వికాసానికి దిక్సూచి రామాయణమని అఖిల భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి కొనియాడారు. ఆదివారం వికారాబాద్ జిల్లా పరిధిలో గల పూడూరు మండలానికి చెందిన రాకంచర్ల క్షేత్రంలో పిల్లిగుండ్ల నాగభూషణం రచించిన శ్రీ మద్రామాయణం (బాలకాండ, అయోధ్యా కాండలకు సంబంధించి) బుర్రకథను గుడుపల్లి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డికి అర్పిస్తూ సత్సంగ సాహిత్యం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుర్రకథ నేటి రూపాన్ని పొందడానికి పూర్వం శైవ ప్రచారకథలుగా, తందాన కథలుగా, జంగం కథలుగా ప్రచారంలో ఉండేవని గుర్తు చేశారు. భారత స్వాతంత్ర సమరంలో జాతీయోద్యమాన్ని తీవ్రతరం చేసే ప్రచార సాహిత్యంలో భాగంగా బుర్రకథ పరిణమించిందని పరిశోధకులు శోధించి వివరించారన్నారు. జానపద ప్రదర్శన కళల్లో అంతర్భాగమైన ది గానే బుర్రకథను గుర్తించారని స్పష్టం చేశారు వాద్యాలలో మొదట కేవలం తాంబుర్రనే వాడిన కారణంగా మొదట తాంబుర్రకథ అని అన్నారు. బుర్రకథలో ప్రధాన కథకుడు ఇద్దరు వంతలు ఉంటారని చెప్పారు. పిల్లిగుండ్ల నాగభూషణం రచించిన బుర్రకథ గ్రంథంలో వంటలు లేరు ప్రధాన కథకుడు కథ చెప్పగా గా వంటలు ఆవృత పదాలు పలుకుతూ మధ్య మధ్య ఒక రహస్యం మరొకరు రాజకీయం చెబుతూ ప్రదర్శనను రక్తి కట్టిస్తారని తెలిపారు. బుర్రకథలో ప్రధాన కథకుడు ప్రేక్షకుల్ని కథలోకి లాక్కెళ్లి గమ్యం వైపు తీసుకొని పోతాడని వివరించారు. యువతకు స్ఫూర్తిగా నిలిచిన నాగప్ప పేరుతో అందరు పిలుచుకునే మా నాగభూషణం అభినందిస్తూ బుర్రకథ కళా ప్రదర్శనను ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో అవధాని అంజయ్య, అధ్యక్షులు అంజిరెడ్డి, వెంకటదాసు ఉమ్మంతల పీఠాధిపతులు నాగభూషణం రచయిత, విశ్వనాథం గోపాలచారి, సాహితీసమితి అధ్యక్షులు వీరకాంతం, రఝునాథరావు తదితరులు పాల్గొన్నారు.